BJP: మంత్రివర్గ విస్తరణ నేప‌థ్యంలో కేబినెట్‌లో క‌మిటీల్లో కీల‌క మార్పులు చేసిన మోదీ

  • మోదీ నేతృత్వంతో రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం
  • స‌భ్యులుగా స్మృతి ఇరానీ, మాండవీయ, భూపేంద్ర, వీరేంద్రకుమార్ త‌దిత‌రులు
  • ప‌లు కమిటీల్లో కొంద‌రు కొత్త మంత్రులు
  • మ‌రికొన్ని క‌మిటీల్లో మార్పులు లేవు
changes in cabinet sub commitees

ఇటీవ‌లే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. కేబినెట్‌లోకి కొంద‌రు కొత్త మంత్రులు రాగా, కొంద‌రిని సాగ‌నంపారు. దీంతో కేబినెట్‌ కమిటీలను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పునర్‌వ్యవస్థీకరించారు. మోదీ నేతృత్వం వహిస్తున్న రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉప సంఘంలో స్మృతి ఇరానీతో పాటు మాండవీయ, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, సోనోవాల్ ఉన్నారు. అలాగే ప‌లు కమిటీల్లో కొంద‌రు కొత్త మంత్రులు చేర‌గా, మ‌రికొన్ని క‌మిటీల్లో మార్పులు లేవు.
 
పార్లమెంటరీ వ్యవహారాల ఉప సంఘం: రాజ్‌నాథ్‌ సింగ్‌,  అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజు, వీరేంద్ర కుమార్‌.

నైపుణ్య వ్యవహారాల ఉప సంఘం: ఆర్సీపీ సింగ్‌, అశ్వనీ చౌబే, భూపేంద్ర యాదవ్‌, కిషన్ రెడ్డి.

భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (ఎలాంటి మార్పులు లేవు):  మోదీ,  రాజ్‌నాథ్‌ సింగ్‌,  అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌,  జైశంకర్.

More Telugu News