Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

Monsoon Arrives In Delhi After Long Delay
  • ఢిల్లీని తాకిన రుతుపవనాలు
  • చుట్టుపక్కల నగరాల్లో కూడా భారీ వర్షాలు
  • గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు
దేశ రాజధాని ఢిల్లీని ఎట్టకేలకు ఈరోజు రుతుపవనాలు తాకాయి. దీని ప్రభావంతో ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ఉన్న గురుగావ్, ఫరీదాబాద్ నగరాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. గాలి వేగం గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాస్తవానికి సాధారణంగా జూన్ 27 ప్రాంతంలో ఢిల్లీని రుతుపవనాలు తాకుతుంటాయి. ఈ ఏడాది దాదాపు 16 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు తాకాయి.

మరోవైపు, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ లోని బహదూర్ ఘర్, గురుగ్రామ్, ఫరీదాబాద్, లోనీ దేహత్, నోయిడాలతో పాటు సోనిపట్, గొహానా, రోహ్ తక్ (హర్యానా), ఖేక్రా (ఉత్తరప్రదేశ్) ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. ఇంకోవైపు భారీ వర్షాల వల్ల ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Delhi
Monsoon
Heavy Rain

More Telugu News