Kathi Mahesh: కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga expresses doubts in Kathi Mahesh death
  • కారు ముందు సీట్లో కూర్చున్న మహేశ్ చనిపోయాడు
  • పక్క సీట్లో కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు
  • మహేశ్ కూర్చున్న వైపే కారు డ్యామేజ్ అయింది
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి మహేశ్ చనిపోయాడని... అదే కారులో పక్కనే కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదని అన్నారు.

కత్తి మహేశ్ కూర్చున్న వైపే కారు డ్యామేజ్ కావడం అనుమానాలకు తావిస్తోందని మంద కృష్ణ చెప్పారు. మహేశ్ కి ఎంతో మంది శత్రువులు ఉన్నారని తెలిపారు. తొలుత కత్తి మహేశ్ కి గాయాలే కాలేదని చెప్పారని అన్నారు. ఆసుపత్రిలో మహేశ్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టారని చెప్పారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Kathi Mahesh
Tollywood
Manda Krishna Madiga
Death

More Telugu News