Sensex: భారీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్

  • 13 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 3 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ఒకానొక సమయంలో 450 పాయింట్ల వరకు పెరిగిన సెన్సెక్స్
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో ఈ ఉదయం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంట గంట వరకు సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్ల వరకు లాభపడింది.

అయితే ఆ తర్వాత ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. యూఎస్ మార్కెట్లు లోయర్ లెవెల్స్ లో ప్రారంభమవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు నష్టపోయి 52,372 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.54%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.89%), యాక్సిస్ బ్యాంక్ (0.78%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.72%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.17%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), ఇన్ఫోసిస్ (-1.01%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.92%), బజాజ్ ఆటో (-0.69%).

More Telugu News