Revanth Reddy: అవసరమైతే కౌశిక్ రెడ్డిని బహిష్కరిస్తాం: రేవంత్ రెడ్డి

  • హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకేనన్న కౌశిక్ రెడ్డి
  • ఇలాంటి చర్యలను సమర్థించబోమన్న రేవంత్ రెడ్డి
  • ఇప్పటికే నోటీసులు ఇచ్చామని వ్యాఖ్య
If needed will suspend Koushik Reddy says Revanth Reddy

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే రాబోతోందంటూ ఆయన మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఆయనకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.

మరోవైపు ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిందారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. అవసరమైతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు.

ఇంకోవైపు కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వస్తుందంటూ కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

More Telugu News