Venkaiah Naidu: చికిత్స పొందుతోన్న వీహెచ్‌కు ఫోన్ చేసిన ఉప రాష్ట్ర‌ప‌తి

venkaiah calls vh
  • హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో వీహెచ్‌కు చికిత్స
  • ప‌రామ‌ర్శించిన వెంక‌య్య నాయుడు
  • తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్ష
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను ప‌లువురు ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ రోజు వీహెచ్‌కు ఫోన్ చేసిన‌ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయ‌న‌ను పరామర్శించారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

చికిత్స అందిస్తోన్న‌ వైద్యుల సలహాలను పాటించాల‌ని వీహెచ్‌కు చెప్పారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని వెంక‌య్య నాయుడు ఆకాంక్షించారు. వీహెచ్‌ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని అన్నారు. వెంక‌య్య నాయుడి పరామర్శతో తనకు తిరిగి ఉత్సాహం వచ్చిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, కొంత‌ కాలంగా వీహెచ్‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గ‌త ఏడాది ఆయ‌నకు క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్‌ను జ‌యించారు.
Venkaiah Naidu
VH
Congress
TRS

More Telugu News