Twitter: ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్​.. గ్రీవెన్స్​ అధికారి నియామకం

  • వినయ్ ప్రకాశ్ కు బాధ్యతలు
  • ఈ మెయిల్ ఐడీని సృష్టించిన సంస్థ
  • కోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చిన ట్విట్టర్
Twitter Appoints Grievance Officer

ట్విట్టర్ ఎట్టకేలకు గ్రీవెన్స్ అధికారిని నియమించింది. కొత్త ఐటీ చట్టాన్ని అమలు చేయకుండా ట్విట్టర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటు కోర్టు కూడా దేశ చట్టాలను అమలు చేయాల్సిందేనని ట్విట్టర్ ను ఆదేశించింది. భారత గ్రీవెన్స్ అధికారి నియామకంపై ట్విట్టర్ ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు మండిపడింది. అధికారి నియామకంపై ఏదో ఒకటి తేల్చాలని ఆదేశిస్తూ ఒకరోజు సమయమిచ్చింది.

ఈ నేపథ్యంలోనే రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ గా వినయ్ ప్రకాశ్ ను ఇవాళ నియమించింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఈమెయిల్ ఐడీనీ సృష్టించింది. భారత కొత్త ఐటీ చట్టంలోని 4 (1) (డీ) ప్రకారం గ్రీవెన్స్ అధికారిని నియమిస్తున్నామని ప్రకటించింది. వాస్తవానికి గ్రీవెన్స్ అధికారి నియామకం కోసం 8 వారాల సమయం కావాలంటూ గురువారం ట్విట్టర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఆ లోపే గ్రీవెన్స్ అధికారిని నియమించింది.

More Telugu News