Manickam Tagore: రేవంత్ రెడ్డి నియామకానికి రూ. 25 కోట్లు తీసుకున్నానా?.. క్షమాపణ చెప్పండి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాణికం ఠాగూర్ నోటీసులు

  • ఎమ్మెల్యే ఆరోపణలతో  తీవ్ర మనస్తాపం
  • తన పరువుకు భంగం కలిగించారంటూ నోటీసులు
  • వారం రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని డిమాండ్
Manickam Tagore sends legal notice to MLA sudhir reddy for defamation remarks

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు రూ. 25 కోట్లు తీసుకున్నారంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన అసత్య ఆరోపణలపై లిఖతపూర్వకంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు పంపారు. సుధీర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.

సుధీర్ రెడ్డి ఆరోపణలతో మాణికం ఠాగూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, వారం రోజుల్లోగా ఆయన లిఖిత పూర్వక సమాధానం చెప్పాలంటూ ఠాగూర్ తరపు న్యాయవాది ఆర్.రవీంద్రన్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకుంటే కోటి రూపాయల పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

More Telugu News