Weather: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.... తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఈ నెల 11 నుంచి 13 వరకు విస్తారంగా వర్షాలు
  • తెలంగాణలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు
  • ఏపీలో తీరం వెంబడి 60 కిమీ వేగంతో గాలులు
Weather forecast for Telugu states

రేపు (ఆదివారం) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దాంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, దీని ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అటు, ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని, రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు వివరించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.

More Telugu News