Harbhajan Singh: భజ్జీ ఇంటికి వారసుడొచ్చాడు!

Harbhajan Overwhelmed in Joy as they welcome Baby Boy
  • ప్రకటించిన మాజీ క్రికెటర్
  • తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వెల్లడి
  • ఇప్పటికే భజ్జీ దంపతులకు కూతురు
మాజీ క్రికెటర్, టర్బొనేటర్ హర్భజన్ కు పుత్రోత్సాహం కలిగింది. భజ్జి ఇంటికి వారసుడొచ్చాడు. ఈరోజు తమకు అబ్బాయి పుట్టాడంటూ భజ్జి ప్రకటించాడు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశాడు. కాగా, హర్భజన్, గీతా బస్రా దంపతులకు ఇప్పటికే హినాయ అనే పాప ఉంది. 2016 జులైలో వారికి తొలిసంతానం కలిగింది.

ఆరోగ్యవంతమైన మగ బిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నామని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని భజ్జి తెలిపాడు. చాలా చాలా ఆనందంగా ఉందన్నాడు. తమ మంచిని కోరుతూ ఎప్పుడూ అండగా నిలిచి ప్రేమను పంచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు.

‘‘మా చేతుల్లోకి మరో చిట్టి చెయ్యి వచ్చింది. అతడి ప్రేమ గొప్పది.. మా బంగారం. మాకు దక్కిన గొప్ప కానుక. అత్యంత ప్రత్యేకమైనదది. ఆ ఆనందంతో మా హృదయాలు ఉప్పొంగుతున్నాయి’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.
Harbhajan Singh
Cricket
Geeta Basra

More Telugu News