Anupama Parameshwaran: ఒక వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డా.. బ్రేకప్ అయింది: అనుపమ పరమేశ్వరన్

I loved a person before says Anupama Parameshwaran
  • హీరోల్లో రామ్ నాకు మంచి ఫ్రెండ్
  • అమ్మ చేసే వంట నాకు చాలా ఇష్టం
  • ప్రశాంతత కోసం పెయింటింగ్స్ వేస్తా
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ప్రేమ కథా చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. వరుసగా ఆఫర్లను చేజిక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా అనుపమ ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. తాజాగా తన జీవితంలో జరిగిన ఒక ఘటన గురించి ఆమె వెల్లడించింది.

గతంలో తాను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ సంచలన ప్రకటన చేసింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డానని... అయితే, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యామని చెప్పింది. సినీ హీరోల్లో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది. అమ్మ చేసే వంట అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. పాటలు పాడటం తనకు ఇష్టమని... తనకు ప్రశాంతత కావాలనుకుంటే పెయింటింగ్స్ వేస్తానని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో '18 పేజీలు', 'కార్తికేయ 2', 'రౌడీ బోయ్స్' చిత్రాల్లో నటిస్తున్నానని... తమిళంలో 'తల్లిపోగాదే' సినిమాలో నటిస్తున్నానని అనుపమ తెలిపింది.
Anupama Parameshwaran
Tollywood
Love
Break Up

More Telugu News