Telangana: సాగర్​ లో విద్యుదుత్పత్తిని ఆపేసిన తెలంగాణ

Telangana Stops Power Generation At Nagarjuna Sagar
  • 11 రోజులు నిరాటంకంగా ఉత్పత్తి 
  •  3 కోట్ల యూనిట్ల ఉత్పత్తి
  • కేంద్రానికి తెలుగు రాష్ట్రాల పోటాపోటీ ఫిర్యాదులు
నాగార్జున సాగర్ లో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. జూన్ 29న అక్కడ కరెంట్ ఉత్పత్తిని ప్రారంభించిన జెన్ కో.. 30 మిలియన్ (3 కోట్ల) యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. 11 రోజుల పాటు అది నిరాటంకంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేయడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. అన్ని ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాలు పోటాపోటీగా బలగాలను మోహరించాయి.

ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్నా కూడా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని లేఖలు రాసింది. అయితే, తెలంగాణ అవసరాల కోసం తమకున్న హక్కులు, నిబంధనల మేరకే జల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామంటూ తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుపైనా రెండు రాష్ట్రాలూ పోటాపోటీగా బోర్డుకు లేఖలు రాశాయి. ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తున్నాయి.
Telangana
Andhra Pradesh
Nagarjuna Sagar
Hydro Power

More Telugu News