KITEX Group: కైటెక్స్ గ్రూప్ రూ.1000 కోట్ల పెట్టుబడితో వస్తోంది: మంత్రి కేటీఆర్

Minister KTR tells KITEX Group will be landed in Telangana
  • చిన్నారుల దుస్తుల తయారీలో నెం.2 కైటెక్స్ 
  • తెలంగాణకు వస్తోందన్న కేటీఆర్
  • కేఎంటీపీలో ఫ్యాక్టరీలు స్థాపిస్తుందని వెల్లడి
  • కైటెక్స్ రాకపై హర్షం
ఓ ప్రపంచస్థాయి సంస్థ భారీ పెట్టుబడితో తెలంగాణలో అడుగుపెడుతోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచస్థాయిలో చిన్నారుల దుస్తుల తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న కైటెక్స్ గ్రూప్ ఇప్పుడు తెలంగాణలో రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కైటెక్స్ వస్తోందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు (కేఎంటీపీ)లో తమ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు కైటెక్స్ ఆసక్తి చూపిస్తోందని వివరించారు. ఈ అంశంలో సత్వర నిర్ణయం తీసుకున్నందుకు కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబు ఎం జాకబ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు.
KITEX Group
KTR
Telangana
Kids Apparel
KMTP Warangal

More Telugu News