KCR: తక్షణమే 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రక్రియ ప్రారంభించండి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • తెలంగాణలో నూతన జోనల్ విధానం
  • రాష్ట్రపతి ఆమోదం
  • జోనల్ అడ్డంకులు తొలగిపోయాయన్న సర్కారు
  • ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలన్న కేసీఆర్
CM KCR orders to start huge recruitment process

తెలంగాణలో నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తెరలేపింది. జోనల్ అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖల్లో ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటిని రెండో దశలో భర్తీ చేయాలని సీఎం సూచించారు.

స్థానికులకు న్యాయం జరగాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం జోనల్ విధానాన్ని తీసుకువచ్చింది. అత్యంత శాస్త్రీయ విధానం అనుసరించి ఈ జోనల్ విధానానికి రూపకల్పన చేసినట్టు టీఆర్ఎస్ సర్కారు చెబుతోంది.

More Telugu News