L.Ramana: ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాననడం హాస్యాస్పదం: ఎల్.రమణ

L Ramana clarifies on why he joining TRS party
  • టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎల్. రమణ
  • టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం
  • ఎమ్మెల్సీ కోసమేనంటూ విమర్శలు
  • తనకు పదవులు కొత్తకాదన్న రమణ
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన తనపై వస్తున్న విమర్శల పట్ల స్పందించారు. ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

పదవులు తనకు కొత్త కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేశానని వివరించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకే అధికార పార్టీలో చేరుతున్నానని ఎల్. రమణ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. కేసీఆర్ తో భేటీలో ఉప ఎన్నిక అంశం చర్చించలేదని తెలిపారు.
L.Ramana
TRS
TDP
MLC
Telangana

More Telugu News