High Court: విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

High Court has taken hearing on Vijayasaireddy petition
  • ఈడీ కేసులు విచారించేందుకు సీబీఐ కోర్టు నిర్ణయం
  • హైకోర్టును ఆశ్రయించిన విజయసాయి
  • మొదట సీబీఐ కేసులు విచారించాలని వినతి
  • వివిధ కోర్టు తీర్పులు పరిశీలిస్తామన్న హైకోర్టు
ఈడీ కేసులు మొదట విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. మొదట సీబీఐ కేసులు విచారణ జరిపేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని విజయసాయిరెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీలుకాకపోతే ఈడీ కేసులు, సీబీఐ కేసులను సమాంతరంగానైనా విచారణ జరపాలని కోరారు.

దీనిపై ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఈడీ కేసులనే మొదట విచారణ జరిపి, అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని సూచించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొదట వేటిని విచారించాలన్న దానిపై స్పష్టత లేదని న్యాయవాదులు అభిప్రాయపడగా... వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.
High Court
Vijayasai Reddy
Jagathi Publications
ED Cases
CBI Cases
CBI Court

More Telugu News