Sensex: బ్యాంకింగ్ స్టాకుల ప్రభావంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 182 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 38 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం వరకు నష్టపోయిన బజాజ్ ఆటో
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ సానుకూలతలు లేకపోవడంతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు నష్టపోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు కోల్పోయి 52,386కి పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 15,689 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.22%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.55%), భారతి ఎయిర్ టెల్ (2.15%), ఎన్టీపీసీ (0.43%), సన్ ఫార్మా (0.32%).    

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-1.95%), టీసీఎస్ (-1.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), యాక్సిస్ బ్యాంక్ (-1.02%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.00%).

More Telugu News