బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం... 52 మంది మృతి

09-07-2021 Fri 14:53
  • ఓ ఫుడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
  • ఆరు అంతస్తుల భవనంలో మంటలు
  • చిక్కుకుపోయిన సిబ్బంది
  • 52 మృతదేహాల వెలికితీత
Huge fire broken out in a food factory in Bangladesh
బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 52 మంది దుర్మరణం పాలయ్యారు. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు.

ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. ఘటన జరిగిన సమయంలో చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.