Andhra Pradesh: నీటి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుంది: మంత్రి ఆదిమూలపు సురేశ్

AP Minister Adimulapu Suresh Fires on Telangana Govt
  • మైదుకూరులో వైఎస్సార్ అగ్రిటెస్ట్ ల్యాబ్ ప్రారంభం
  • ఏపీ అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత
  • దానిని కప్పిపుచ్చుకునేందుకే ప్రాంతీయ విభేదాలు
నీటి విషయంలో మన వాటా చివరి బొట్టు అందేవరకు వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. కడప జిల్లా మైదుకూరు సమీపంలోని తెలుగు గంగ కాలనీ ఆవరణలో నిర్మించిన వైఎస్సార్ అగ్రిటెస్ట్ ల్యాబ్‌ను నిన్న వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చేపట్టిన అభివృద్ధి పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దానిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కనపెట్టి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. మన వాటా చివరి బొట్టు అందే వరకు వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Kadapa District
Adimulapu Suresh
Telangana

More Telugu News