Olympics: ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్... అధికారిక ప్రకటన చేసిన జపాన్

Japan announced will held Olympics without spectators
  • టోక్యోలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ
  • జులై 23న ప్రారంభం
  • టోక్యోలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ
  • ఆగస్టు 22 వరకు ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం
ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తున్న జపాన్ రాజధాని టోక్యోలో కరోనా డెల్టా వేరియంట్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో, అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్ క్రీడలు నిర్వహించనున్నట్టు జపాన్ ఒలింపిక్స్ మంత్రి తమాయో మరుకవా వెల్లడించారు. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు అందుకు అంగీకరించారని తెలిపారు.

టోక్యోలో కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఆ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్ కారణంగానే అని గుర్తించారు. దాంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం టోక్యోలో ఆగస్టు 22 వరకు అత్యయిక పరిస్థితి అమల్లో ఉంటుందని ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి.
Olympics
Tokyo
Spectators
Japan
Corona Delta Variant

More Telugu News