Telangana: కరోనా తీవ్రత తగ్గింది.. థర్డ్ వేవ్ ముప్పుపై ఆధారాలు లేవు: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

  • కరోనా కేసులు తగ్గినప్పటికీ అందరూ జాగ్రత్తగా ఉండాలి
  • వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది
  • హైదరాబాదులో 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నాం
Corona intensity is decreased says TS health director

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉందని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై ఇప్పటి వరకు సరైన ఆధారాలు లేవని చెప్పారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు 30 లక్షల మందికి పైగా రెండో డోస్ తీసుకునేవారు ఉన్నారని తెలిపారు.

హైదరాబాదులో 100కు పైగా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేస్తున్నట్టు శ్రీనివాసరావు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. గత రెండేళ్లలో సీజనల్ వ్యాధులు కూడా తగ్గాయని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని మలేరియా ఫ్రీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

More Telugu News