KTR: టీఆర్ఎస్ పార్టీలో చేరిన సింగ‌రేణి బీఎంఎస్ అధ్య‌క్షుడు కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య

  • అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరిన మల్లయ్య
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్
  • కేసీఆర్ పాలన అందరినీ ఆకట్టుకుంటోందన్న కేటీఆర్
Singereni BMS president joins TRS

సింగరేణ్ కోల్ మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కెంగర్ల మల్లయ్యకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ వెంకటేశ్ లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ లోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు.

కెంగర్ల మల్లయ్య మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని అన్నారు. 13 నుంచి 14 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా, మరో 15 నుంచి 20 నియోజకవర్గాల్లో పరోక్షంగా సింగరేణి కార్మికుల పాత్ర ఉందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కార్మికులతో కలిసిపోవాలని అన్నారు.

More Telugu News