YSR: వైయస్సార్ కు నివాళి అర్పించిన రేవంత్.. భారతరత్న ఇవ్వాలన్న జీవన్ రెడ్డి!

  • పంజాగుట్టలో వైయస్ కు నివాళి అర్పించిన రేవంత్
  • భారతరత్నకు అర్హత కలిగిన ఏకైక తెలుగు వ్యక్తి వైయస్ మాత్రమేనన్న జీవన్ రెడ్డి
  • కాళేశ్వరం ప్రాజెక్టు వైయస్ హయాంలోనే ప్రారంభమయిందని వ్యాఖ్య
Revanth reddy pays tributes to YSR

మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాదులోని పంజాగుట్ట సెంటర్ వద్ద ఉన్న వైయస్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
 
మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఘనతను వైయస్ ప్రపంచానికి చాటారని కొనియాడారు. భారతరత్నకు అర్హత కలిగిన ఏకైక తెలుగు వ్యక్తి వైయస్ మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైయస్ హయాంలోనే ప్రారంభమయిందని... ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. తెలంగాణలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు వైయస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టలేదని... ఆ ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. వైయస్సార్ తెలంగాణ పక్షపాతి అని అన్నారు.

More Telugu News