Essar Steel: కడప ఉక్కు పరిశ్రమకు నవంబరులో శంకుస్థాపన

Kadapa steel plant builing works starts in Novermber
  • పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
  • సంస్థ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం చర్చ
  • పాల్గొన్న ఎస్సార్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా
కడపలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమకు నవంబరులో శంకుస్థాపన చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. రూ. 11 వేల కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుండగా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

ఇక్కడ ఏడాదికి మూడువేల టన్నుల హై గ్రేడ్ ఉక్కును ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి నిన్న క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డితో కలిసి సీఎం జగన్ ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులతో చర్చించారు. ఈ భేటీలో ఆ సంస్థ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ చైర్మన్ జె.మెహ్రా పాల్గొన్నారు.
Essar Steel
Kadapa
Andhra Pradesh
Steel Plant

More Telugu News