Majid Hussain: హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ పై రెండు కేసుల నమోదు

Banjara Hills police files two cases against Ex Mayor Majid Hussain
  • భూవివాదంలో జోక్యం చేసుకున్న మాజిద్
  • పోలీసులను కూడా దుర్భాషలాడిన వైనం
  • విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్సై రవిరాజ్ ఫిర్యాదు
హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం నేత మాజిద్ హుస్సేన్ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఓ భూవివాదం కేసులో మాజిద్ హుస్సేన్ జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో పోలీసులు అక్కడకు చేరుకుని, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులపై కూడా మాజిద్ విరుచుకుపడ్డారు.

అసభ్యకర రీతిలో పోలీసులతో వాగ్వాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో మాజిద్ పై బంజారాహిల్స్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. భూవివాదంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరించినందుకు ఒక కేసు, పోలీసులను దుర్భాషలాడినందుకు మరో కేసు పెట్టారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్సై రవిరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Majid Hussain
Hyderabad
Ex Mayor
MIM
Police
Banjara Hills
Cases
Land Issue

More Telugu News