Telangana: తెలంగాణలో సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేనట్టే!

Distributers not willing to open Cenema halls in Telangana
  • థియేటర్ల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ ప్రభుత్వం
  • ఓటీటీల్లో సినిమాలు విడుదల చేయవద్దని కండిషన్ పెడుతున్న డిస్ట్రిబ్యూటర్లు
  • ఓటీటీల నుంచి థియేటర్లను కాపాడాలని డిమాండ్
టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్లు షాకిచ్చారు. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లను తెరిచేందుకు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు, సినీ ప్రముఖులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్లను తెరిచే అంశంపై చర్చలు జరిపారు. అయితే అందుకు డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అన్నారు.

ఓటీటీల వల్ల థియేటర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తాయని... ఓటీటీల నుంచి థియేటర్లను రక్షించాలని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ఓటీటీల్లో సినిమాల విడుదలను ఆపేంత వరకు థియేటర్లను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో, నిర్మాతలకు షాక్ తగిలింది. ఇప్పటికే తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు సన్నాహకాలు చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పడంతో... థియేటర్ల పునఃప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో, నిర్మాతలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.
Telangana
Cinema Theaters
Reopen
Distributers
OTT

More Telugu News