Gorantla Butchaiah Chowdary: తూతూ మంత్రంగా కృష్ణా బోర్డ్ కి లేఖలు రాయడం వల్ల ఏంటి ప్రయోజనం?: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

gorantla slams govt
  • ఒక పక్క కృష్ణా జలాల విషయంలో అస‌మ‌ర్థ‌త‌
  • ఏపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
  • తెలంగాణ ముఖ్యమంత్రి రాజీ లేదు అంటున్నారు
  • ఎంత వరకు అయినా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం పెరిగిపోయిన నేప‌థ్యంలో ఈ అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

'ఒక పక్క కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రాజీ లేదు ఎంత వరకు అయినా పోరాడతామని స్పష్టం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? తూతూ మంత్రంగా కృష్ణా బోర్డ్ కి లేఖలు రాయడం వల్ల ఏంటి ప్రయోజనం వైఎస్ జ‌గ‌న్?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

'89.15 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా 175.54 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు అని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. మీ అసమర్థ చర్యల వల్ల రాష్ట్రం నష్టపోతోంది' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమర్శించారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News