కంభంపాటి, దత్తాత్రేయలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

06-07-2021 Tue 22:04
  • మిజోరాం గవర్నర్ గా హరిబాబు నియామకం 
  • హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ
  • పదవీకాలం సాఫీగా సాగిపోవాలన్న చంద్రబాబు
  • కంభంపాటి కచ్చితంగా రాణిస్తారని వ్యాఖ్యలు
Chandrababu congratulates Kambhampati and Dattatreya
మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమితులు కాగా, బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు వారిరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'హర్యానా గవర్నర్ గా నియమితులైనందుకు కంగ్రాచ్యులేషన్స్ దత్తాత్రేయ గారూ' అంటూ ట్వీట్ చేశారు. పదవీకాలం సాఫీగా సాగిపోవాలని, ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇక, మిజోరాం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ స్పందించారు. గవర్నర్ గా కంభంపాటి కచ్చితంగా రాణిస్తారని, సుహృద్భావ వైఖరితో, అంకితభావంతో, నిబద్ధతతో వ్యవహరిస్తారని చెప్పగలనని చంద్రబాబు పేర్కొన్నారు.