Harish Rao: సిద్ధిపేట అభివృద్ధిపై యువకులు రూపొందించిన వీడియో పంచుకున్న హరీశ్ రావు

  • సిద్ధిపేటలో అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో
  • వీడియోను విడుదల చేసిన మైక్ టీవీ
  • సిద్ధిపేట ఘనతలను వివరిస్తూ సాగిన వీడియో
  • అభినందించిన సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావు
Harish Rao shares a video of Siddipet development

మైక్ టీవీ అనే మీడియా సంస్థ ఆధ్వర్యంలో యువకులు సిద్ధిపేట పట్టణం అభివృద్ధిపై ఓ వీడియో రూపొందించారు. ఇందులో ఇద్దరు యువకులు సిద్ధిపేట ఘనతలను ప్రస్తావిస్తూ పట్టణం అంతా ఓసారి చుట్టిరావడం చూడొచ్చు. సిద్ధిపేట వెళుతున్నామని ఓ యువకుడు చెప్పగా, సిద్ధిపేటలో ఏమున్నాయి? అంటూ మరో యువకుడు ప్రశ్నించడంతో వీడియో ప్రారంభం అవుతుంది. చూపిస్తా పద అంటూ ఆ యువకుడు పట్ణణంలోని అభివృద్ధిని వరుసగా చూపించుకుంటూ వెళ్లడాన్ని వీడియోగా రూపొందించారు.

దీనిపై సిద్ధిపేట శాసనసభ్యుడు, మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ వీడియోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. సిద్ధిపేట వైభవాన్ని ఘనంగా చాటేలా వీడియో ఉందని అభినందించారు. సిద్ధిపేటలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ఈ వీడియో తమకు కూడా ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మైక్ టీవీ మీడియా సంస్థ ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News