Lee Hsien Loong: సిక్కు వేషధారణలో వచ్చిన సింగపూర్ ప్రధాని

  • సింగపూర్ లోని సిలాత్ రోడ్డులో గురుద్వారా నవీకరణ
  • ప్రారంభోత్సవానికి హాజరైన లీ సేన్ లూంగ్
  • సత్ శ్రీ ఆకాల్ అంటూ అభివాదం
  • కరోనా వేళ సిక్కుల సేవలు ఎనలేనివని కితాబు
Singapore PM attends inauguration of a Gurudwara in Sikh getup

సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్ సిక్కుల వేషధారణలో అలరించారు. సిలాత్ రోడ్ లోని ఓ నవీకరించిన గురుద్వారా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన తెల్లని తలపాగా ధరించి కనువిందు చేశారు. అంతేకాదు, పంజాబీలో "సత్ శ్రీ ఆకాల్" అంటూ పలికి సిక్కులకు అభివాదం చేశారు.

సింగపూర్ లో కరోనా సంక్షోభం సందర్భంగా సిక్కు సమాజం సేవలు ఎనలేనివని ప్రధాని లీ సేన్ లూంగ్ కొనియాడారు. కరోనా బాధితుల నేపథ్యం, ప్రాంతం, మతం, రంగు ఏమీ చూడకుండా వారికి సేవలు అందించేందుకు సింగపూర్ లోని గురుద్వారాలు తమ సభ్యులను ఉరుకులు పరుగులు పెట్టించాయని వెల్లడించారు. అనేక మతాల సమాహారమైన సింగపూర్ కు సిలాత్ రోడ్ లోని గురుద్వారా ఒక వెలుగు దివ్వె వంటిదని ప్రధాని లీ సేన్ లూంగ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సింగపూర్ సిక్కులు ఆయనకు తమ మత సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఓ ఖడ్గాన్ని బహూకరించారు.

More Telugu News