Telangana: కేసీఆర్ తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉంది!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఉమ్మడి ఏపీ ఉన్నప్పటి కంటే జల దోపిడీ ఎక్కువైంది
  • ఏపీ దోపిడీనీ కేసీఆర్ అడ్డుకోవడం లేదు
  • కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనన్న ఉత్తమ్  
Water theft is more after Telangana formation says Uttam Kumar Reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నీటి దోపిడీతో పోలిస్తే... తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన దోపిడీనే ఎక్కువని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడీపై పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి 4 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ యత్నిస్తుంటే సీఎం కేసీఆర్ అడ్డుకోకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు.

ఇక ఇన్నాళ్లూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఉత్తమ్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిలో లేకపోయినప్పటికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనని అన్నారు. పోలీసుల వేధింపులను సైతం ఎదుర్కొని కార్యకర్తలు నిలబడ్డారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని... మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని అన్నారు. 

More Telugu News