Olympics: ఒలింపిక్స్ కోసం వెళ్లిన అథ్లెట్ కు కరోనా పాజిటివ్

  • టోక్యోకు చేరుకున్న సెర్బియా అథ్లెట్ల బృందం
  • ఒక సెర్బియన్ అథ్లెట్ కు పాజిటివ్ గా నిర్ధారణ
  • విమానాశ్రయం నుంచి ఐసొలేషన్ కు తరలింపు
Serbian athlete who reached Tokyo tested with Corona positive

టోక్యో ఒలింపిక్స్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. స్టేడియంలలో ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. మరోవైపు వివిధ దేశాల నుంచి అథ్లెట్లు టోక్యోకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు షాక్ తగిలింది. టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఒక అథ్లెట్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. టోక్యోలోని హనెడా ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఈ దేశ టీమ్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ఒక అథ్లెట్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ గా తేలిన అథ్లెట్ ను ఐసొలేషన్ కు తరలించారు. మిగిలిన అథ్లెట్లను సమీపంలో ఉన్న ప్రత్యేక కేంద్రానికి తరలించి ఐసొలేట్ చేశారు. గత నెలలో ఉగాండాకు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, విమానాశ్రయంలో కొవిడ్ స్క్రీనింగ్ ను అధికారులు కట్టుదిట్టం చేశారు.

More Telugu News