Sanju: నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలో తప్పిపోయిన బాలుడు... డ్రోన్లతో రెస్క్యూ ఆపరేషన్

Boy missing in Nellore district Penusila reserve forest
  • 8 రోజులుగా ఆచూకీ లేని సంజు
  • భారీస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్
  • సెర్చ్ ఆపరేషన్ లో పోలీసు జాగిలాలు
  • కన్నీరుమున్నీరవుతున్న సంజు తల్లిదండ్రులు
నెల్లూరు జిల్లాలో 1000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న పెనుశిల అభయారణ్యంలో సంజు అనే బాలుడు తప్పిపోయాడు. ఈ ఘటన జరిగి 8 రోజులు కాగా, అధికారులు భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో డ్రోన్ల సాయంతో బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసు జాగిలాలు కూడా పాలుపంచుకుంటున్నాయి. అటవీశాఖ సిబ్బంది సాయంతో పెనుశిల అభయారణ్యంలోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. వారం రోజులు దాటినా తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో సంజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Sanju
Missing
Penusila Forest
Nellore District
Andhra Pradesh

More Telugu News