TG Venkatesh: కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదు: టీజీ వెంకటేశ్

  • కరోనా వల్ల కేసీఆర్ కు మెదడు దెబ్బతింది
  • నీటి ఒప్పందాలను ఆయన మర్చిపోయారు
  • జల వివాదాలు సివిల్ వార్ కు దారి తీస్తాయి
Rayalaseema and Andhra leaders not to afraid of KCR says TG Venkatesh

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఏపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా కేసీఆర్ కు మెదడు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. ఈ కారణంగా నీటి పంపకాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అని తెలంగాణ నేతలు అంటున్నారని... అది విద్యుత్ ప్రాజెక్టు అయినప్పుడు దాని నీటిని సాగునీరుగా, తాగునీరుగా ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు.

జల వివాదాలు సివిల్ వార్ కు దారి తీస్తాయని టీజీ వెంకటేశ్ చెప్పారు. కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదన అన్నారు. ఏపీ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి తప్ప... తెలంగాణ ఓట్లు ఏపీలో లేవని చెప్పారు. కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తారని... హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఆంధ్ర పాట, కరీంనగర్ ఎన్నికలప్పుడు తెలంగాణ పాట పాడతారని విమర్శించారు. ఏపీ పోలీసులు యాక్షన్ తీసుకుని శ్రీశైలం డ్యామ్ ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు.

More Telugu News