India: భారత్ సహా ఐదు దేశాల ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తేసిన జర్మనీ

Germany lifted air ban on India
  • డెల్టా వేరియంట్ తో ప్రభావితమైన ఐదు దేశాలపై నిషేధం ఎత్తివేత
  • భారత పౌరుల రాకపోకలకు తొలగిన అడ్డంకి
  • భారత్ లో జర్మనీ రాయబారి ప్రకటన  
కరోనా వల్ల వివిధ దేశాల మధ్య రాకపోకలు కూడా బంద్ అయిన సంగతి తెలిసిందే. భారత్ పై కూడా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ క్రమంగా ఇతర దేశాలపై ఆంక్షలు ఎత్తేస్తోంది. ఈ దేశాల్లో భారత్ సహా ఐదు దేశాలు ఉన్నాయి. డెల్టా వేరియంట్ తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు భారత్ లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జర్మనీ ప్రజలే కాకుండా ఈ దేశాలకు చెందిన ప్రజలు కూడా దేశంలో ప్రవేశించవచ్చని చెప్పారు.  
India
Germany
Air Ban
Shifted

More Telugu News