YSRCPTP: తెలంగాణ మ్యాప్ మధ్యలో వైఎస్సార్ ఫొటో.. షర్మిల పార్టీ జెండా ఇదే!

  • ఈ నెల 8న పార్టీ ప్రకటన
  •  అదే రోజు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు
  • అక్కడి నుంచి హైదరాబాద్‌కు
  • రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు
YSR Telangana Party flag Ready

తెలంగాణలో పార్టీ ప్రకటనకు సిద్ధమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ జెండా రెడీ అయింది. పాలపిట్ట, నీలం రంగులతో ఉన్న జెండా మధ్యలో తెలంగాణ రాష్ట్ర పటం, దాని మధ్యలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోతో జెండాను రూపొందించారు. షర్మిల ఎల్లుండి తన పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్నారు. ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 8న సాయంత్రం జరగనున్న కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్న షర్మిల.. పార్టీ జెండాను కూడా ఆవిష్కరిస్తారు.

షర్మిల 8న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేక చాపర్‌లో హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఫిలింనగర్‌లోని సభా వేదికను చేరుకుని పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు హాజరుకానున్నారు.

More Telugu News