ఏపీ అభ్యంతరాలు బేఖాతరు... విద్యుదుత్పత్తిని మరింత పెంచిన తెలంగాణ
- ఏపీ, తెలంగాణ మధ్య ప్రాజెక్టు విభేదాలు
- తెలంగాణ విద్యుదుత్పత్తిపై ఏపీ అసంతృప్తి
- తాజాగా పులిచింతల వద్ద 50 మెగావాట్ల ఉత్పాదన
- మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి
కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన తెలంగాణ జెన్ కో... ఇవాళ మధ్యాహ్నం 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ అధికారులు ఆరోపించారు. పులిచింతలలోని 3 యూనిట్ల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.