Tokyo Olympics: జులై 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం

  • ఎట్టకేలకు ప్రారంభం అవుతున్న ఒలింపిక్స్
  • భారత్ నుంచి భారీ బృందం
  • త్రివర్ణపతాకం మోయనున్న మేరీకోమ్, మన్ ప్రీత్
  • చీర్ ఫర్ ఇండియా అంటూ మోదీ నినాదం
Tokyo Olympics set start July twenty third

విశ్వ క్రీడాసంరంభం ఒలింపిక్స్ ఈసారి జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ఈ నెలలో క్రీడాభిమానులను అలరించేందుకు ప్రారంభం కానున్నాయి. జులై 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్స కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బృందానికి మేటి బాక్సర్ మేరీకోమ్, హాకీ ఆటగాడు మన్ ప్రీత్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. మార్చ్ పాస్ట్ లో వీరిద్దరూ భారత త్రివర్ణ పతాకం చేతబూని దేశ క్రీడా బృందానికి ముందు నడవనున్నారు. ముగింపు కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పునియా భారత జెండా మోయనున్నాడు.

కాగా, ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లను చీర్ ఫర్ ఇండియా నినాదాంతో ఉత్సాహపరిచారు. ఒలింపిక్స్ కు వెళుతున్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రోత్సహించాలని మోదీ ప్రజలను కోరారు.

More Telugu News