Vijay Serhupathi: 'ఆహా'లో విజయ్ సేతుపతి 'విక్రమార్కుడు'

Vijay Sethupathi Vikramarkudu movie in Aha
  • తమిళంలో హిట్ కొట్టిన 'జుంగా'
  • తెలుగు అనువాదంగా 'విక్రమార్కుడు'
  • మాఫియా డాన్ గా విజయ్ సేతుపతి
  • ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్  
విజయ్ సేతుపతి విలక్షణమైన పాత్రలను పోషించిన సినిమాలలో 'జుంగా' ఒకటిగా కనిపిస్తుంది. 2018లో తమిళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాను 'ఆహా' వారు 'విక్రమార్కుడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి 'ఆహా' ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విజయాలను సాధించిన ఇతర భాషా చిత్రాలను కూడా అనువాదాలుగా అందిస్తోంది.అలా ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై నుంచి 'విక్రమార్కుడు' పలకరించనుంది. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సయేషా సైగల్ .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. ఇటీవల కాలంలో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ముఖ్యంగా 'ఉప్పెన' సినిమాతో ఆయనకి ఇక్కడ విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందువలన ఈ సినిమా రీచ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.  
Vijay Serhupathi
Sayyeshaa
Madonna Sebastian

More Telugu News