Mohanlal: 'దృశ్యం' దర్శకుడి '12TH MAN'.. హీరోగా మోహన్ లాల్!

Mohanlal latest movie with jeethu Joseph
  • వరుస విజయాలు 
  • విభిన్నమైన పాత్రలు 
  • కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్
మలయాళంలో మోహన్ లాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయోగాలు చాలావరకూ సక్సెస్ అయ్యాయి. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో ఆయన మలయాళ సినిమాను మరో స్థాయికి తీసుకువెళుతున్నారు. మలయాళంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం' అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఏ భాషలో రీమేక్ చేసినా ఈ కథకి విశేషమైన ఆదరణ లభించింది. దాంతో ఇటీవల మలయాళంలో 'దృశ్యం 2' పేరుతో సీక్వెల్ చేయగా, విశేషమైన స్పందన లభించింది.

కథను పట్టుగా అల్లడంలో .. కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో జీతూ జోసెఫ్ కి మంచి అనుభవం ఉంది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కథను మలుపులు తిప్పడం ఆయన ప్రత్యేకత. అలాంటి జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ..  సినిమా పేరే '12TH MAN'. ఆశీర్వాద బ్యానర్ పై ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ .. టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.    
Mohanlal
Jeethu Joseph
12th Man

More Telugu News