Mallu Ravi: రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు: మల్లు రవి

Congress senior leader Mallu Ravi opines on latest developments
  • ఇటీవల టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం
  • కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వాళ్లు విమర్శిస్తున్నారన్న మల్లు
  • వారంతా తిరిగి రావాలని పిలుపు
  • కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటుందని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సీనియర్ నేత మల్లు రవి స్పందించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన వారు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆయా నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారేమోనన్న భయంతో అవాకులు, చెవాకులు మాట్లాడించారని మల్లు రవి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరిన వారు టీపీసీసీ అధ్యక్ష పదవి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటుందని, ఒక నియంత పాలనలో బతకాల్సిన అవసరం లేదని మల్లు రవి పేర్కొన్నారు.
Mallu Ravi
Revanth Reddy
Congress
TRS
TPCC President
Telangana

More Telugu News