అమెజాన్ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆండీ జాస్సీ
- సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న బెజోస్
- తన శిష్యుడు జాస్సీకి పగ్గాల అప్పగింత
- హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి వచ్చిన జాస్సీ
- అమెజాన్ వృద్ధి కొనసాగిస్తాడని బెజోస్ నమ్మకం
అమెజాన్ ఇప్పుడు ఈ-మార్కెట్ రంగంలోనే కాదు ఓటీటీ (అమెజాన్ ప్రైమ్), క్లౌడ్ కంప్యూటింగ్ ( అమెజాన్ వెబ్ సర్వీసెస్) రంగాల్లోనూ దూసుకుపోతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాసుల వర్షం కురిపించే సంస్థగా ఎదగడంలో నూతన సీఈఓ ఆండీ జాస్సీ కృషి ఎంతో ఉంది. వెబ్ సర్వీసెస్ రంగంలో ఆదాయాన్ని పసిగట్టిన జెఫ్ బెజోస్ ఏడబ్ల్యూఎస్ కు రూపకల్పన చేయగా, దాన్ని లాభాల బాట పట్టించింది ఆండీ జాస్సీ.
జాస్సీ... ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా అందుకున్నారు. క్రీడల పట్ల మక్కువ చూపించే అమెజాన్ నూతన సీఈఓ తన ఇంటిలోనూ క్రీడా వేదికలను తలపించే నిర్మాణాలతో తన అభిరుచిని చాటుకున్నారు.