Ram Gopal Varma: అమ్మాయిలపై దాడి ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందన

Ram Gopal Varma responds on attacks on two girls
  • మధ్యప్రదేశ్ లో ఇద్దరు అమ్మాయిలను చితకబాదిన బంధువులు
  • ఈ దారుణాన్ని నమ్మలేకపోతున్నానన్న వర్మ
  • దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్
మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఓ ఘటనపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, ధార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంత కాలంగా ఫోన్ లో మాట్లాడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఇద్దరినీ చితకబాదారు. గత నెల 22న వీరిపై దాడి జరిగింది. జుట్టు పట్టుకుని ఇద్దరినీ ఈడుస్తూ, కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
 
మరోవైపు ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ దారుణాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించాలని... లేకపోతే ఈ దేశంపై తనకు ఉన్న నమ్మకమే పోతుందని పేర్కొన్నారు. 
Ram Gopal Varma
Tollywood
Girls
Attack
Madhya Pradesh

More Telugu News