Mehreen Pirzada: 'ఎఫ్ 3' ఫ్యామిలీలోకి తిరిగి వచ్చాను: మెహ్రీన్

Came back to F3 family says Mehreen
  • తన ప్రియుడితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న మెహ్రీన్
  • ఇంతలోనే  'ఎఫ్ 3' షూటింగ్ కు హాజరు
  • వరుణ్, అనిల్, సునీల్ లతో కలిసి దిగిన ఫొటో షేర్
టాలీవుడ్ నటి మెహ్రీన్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయితో అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఇకపై తన పూర్తి దృష్టిని సినిమాలపైనే సారిస్తానని చెప్పింది.

ప్రస్తుతం ఆమె 'ఎఫ్ 3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ తదితరులతో కలిసి దిగిన ఫొటోను మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. తన ఫేవరెట్ 'ఎఫ్ 3' ఫ్యామిలోకి తిరిగొచ్చానని ఆ ఫొటో కు క్యాప్షన్ పెట్టింది. తన నిశ్చితార్థం రద్దయిన తరుణంలో సినిమా సెట్స్ లో ఆమె సంతోషంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
 
'ఎఫ్ 2' చిత్రం 2019లో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తదితరులు నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'ఎఫ్ 3' నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
Mehreen Pirzada
F 3 Movie
Tollywood
Varun Tej

More Telugu News