TS High Court: తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ పిటిష‌న్.. తిర‌స్క‌రించిన హైకోర్టు

  • అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో ఈ నెల‌లోనే యూజీ, పీజీ పరీక్షలు
  •  వాయిదా వేయాల‌ని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
  •  పిటిషన్‌ స్వీకరణకు అనుమతి నిరాక‌ర‌ణ‌
  •  ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌న్న హైకోర్టు
petition in high court on exams

తెలంగాణలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో యూజీ, పీజీ పరీక్షలను ఈ నెల‌లోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం సూచించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే అన్ని వ‌ర్సిటీలు పరీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించి, అన్ని ఏర్పాట్లు చేసుకుని నిర్వ‌హిస్తున్నాయి. అయితే, ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ప‌రీక్ష‌లు వాయిదా వేయాలంటూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఉదయం ప్రయత్నించారు. ఈ  పిటిషన్‌ స్వీకరణకు అనుమతి కోరారు. అయితే, దీనిపై స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ రోజు ఉదయం పది గంటలకు ప‌రీక్ష‌లు మొదలైతే, వాయిదా వేయాల‌ని ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌ని, ఇన్ని రోజులు ఏం చేశార‌ని పిటిషనర్ ను కోర్టు నిల‌దీసింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయ‌ని, ఇక‌ దీనిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. లంచ్‌మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వ‌బోమ‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News