surya: హీరో సూర్య‌కు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత‌లు!

  • సినిమాటోగ్రఫీ చట్టం-1952 సవరణ‌పై సూర్య అభ్యంత‌రాలు
  • ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఇటీవ‌లే వ్యాఖ్య‌
  • సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలన్న బీజేపీ
  • లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక‌
bjp warns surya

కేంద్ర ప్ర‌భుత్వం సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ పెద్ద‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే.  ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఇటీవ‌లే త‌మిళ హీరో సూర్య కూడా అభిప్రాయపడ్డాడు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కోస‌మే చట్టాలు చేయాల‌ని, అంతేగానీ, ఆ స్వేచ్ఛ‌ను నాశ‌నం చేయ‌డం కోసం కాదని సూర్య అన్నాడు.

దీనిపై తమిళనాడు బీజేపీ విభాగం మండిప‌డుతూ సూర్య‌కు హెచ్చ‌రిక చేసింది. సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలని చెప్పింది. అంతేగానీ, ఇతర విషయాలపై అనవసరంగా జోక్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేయ‌కూడ‌ద‌ని చెప్పుకొచ్చింది. సూర్య త‌న తీరును మార్చుకోక‌పోతే  న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీజేపీ యువజన విభాగం నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

More Telugu News