Petrol: పరుగులు తీస్తున్న పెట్రో ధరలు.. 14 రాష్ట్రాల్లో వంద రూపాయలు దాటిన వైనం

  • పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో 18 రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు
  • ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 34సార్లు పెంపు
  • మూడు రాష్ట్రాల్లో రూ. 100 దాటిన డీజిల్ ధర
Petrol and Diesel Prices Hiked On Sunday

పెట్రోలు ధరలు పరుగులు తీస్తున్నాయి. ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులపై ఎనలేని భారం మోపుతున్నాయి. నిన్న పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. ఫలితంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. మూడు రాష్ట్రాల్లో డీజిల్ ధర కూడా రూ. 100 దాటిపోయింది.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.99.51గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.103.41గా ఉంది. డిజిల్ ధర లీటరు రూ. 97.40గా ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 34 సార్లు పెరగడం గమనార్హం.

More Telugu News