KTR: ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా పేర్కొన్నారు: మంత్రి కేటీఆర్

KTR participates KCR tour in Sircilla district
  • సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటన
  • కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న కేటీఆర్
  • మిషన్ కాకతీయ విజయవంతం అని వెల్లడి
  • భూగర్భ జలాలు పెరిగాయని కేటీఆర్ వివరణ
సీఎం కేసీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేయగా, ఈ పర్యటనలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, మిషన్ కాకతీయ విజయవంతంగా పూర్తయిందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6 మీటర్లు పైకి వచ్చాయని వెల్లడించారు. ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా పేర్కొన్నారని తెలిపారు.

జిల్లాలో మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గత ఏడేళ్లలో సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం, మిడ్ మానేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.
KTR
Rajanna Sircilla District
Mission Kakateeya
KCR
TRS
Telangana

More Telugu News