జగన్ తీరు ఎస్సీలకు చాలా ప్రమాదకరం: జడ్జి రామకృష్ణ

04-07-2021 Sun 20:54
  • ఇటీవల జైలు నుంచి విడుదలైన జడ్జి రామకృష్ణ
  • ఎస్సీల హక్కులు కాలరాస్తున్నారని ఆవేదన
  • ప్రశ్నించే ఎస్సీల గొంతు నొక్కుతున్నారని విమర్శలు
  • జగన్ ది విధ్వంసక పాలన అంటూ వ్యాఖ్యలు
Judge Ramakrishna slams CM Jagan

ఇటీవలే జైలు నుంచి విడుదలైన జడ్జి రామకృష్ణ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఎస్సీల హక్కులు కాలరాస్తూ విధ్వంసక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దళితులను నిర్వీర్యం చేసేలా జగన్ పాలన ఉందని అన్నారు. ప్రశ్నించే ఎస్సీల గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం జగన్ వ్యవహరిస్తున్న తీరు ఎస్సీలకు చాలా ప్రమాదకరంగా మారిందని జడ్జి రామకృష్ణ పేర్కొన్నారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల పట్ల పోలీసులు కేసులు నమోదు చేయడంలేదని, పోలీసుల తీరుపై పాదయాత్రగా వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.