CM KCR: రిబ్బన్ కట్ చేద్దామంటే కత్తెర లేదు... సీఎం కేసీఆర్ ఏంచేశారో చూడండి!

CM KCR cut the ribbon with hands in an angry moment
  • సిరిసిల్లా జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • పలు అభివృద్ధి పనులు ప్రారంభం
  • డబుల్ బెడ్రూం ఇళ్లకు పూజా కార్యక్రమాలు
  • చేత్తోనే రిబ్బన్ లాగిపారేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అయితే, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రిబ్బన్ కట్ చేయడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర దొరక్కపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.

అధికారులు, సిబ్బంది ఒకర్నొకరు కత్తెర ఏదంటూ ప్రశ్నించుకోవడం సీఎం కేసీఆర్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాసేపు వేచిచూసిన ఆయన కోపంతో రిబ్బన్ ను చేత్తోనే పీకి పారేశారు. ఆపై లబ్దిదారులతో కలిసి డబుల్ బెడ్రూం ఇంటిలోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
CM KCR
Ribbon
Cutting
Scissors
Rajanna Sircilla District

More Telugu News